అన్నదానానికి భూరి విరాళం అందించిన కామసాని రామిరెడ్డి
పొదిలి విశ్వనాధపురం కాలేజీరోడ్డు రామాలయం నందు గోవింద స్వాములకు అన్నదాన కార్యక్రమానికియువ పారిశ్రామిక వేత్త కామసాని రామిరెడ్డి 1,21116 ఒక లక్ష ఇరవై ఒక్క వేల నూట పదహారు రూపాయల విరాళాన్ని ఆదివారం అందజేశారు.అనంతరం గోవిందస్వాములు రామిరెడ్డి దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు. హైదరాబాద్ నగరంలో యువ పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్న కామసాని రామిరెడ్డి భూరి విరాళం పట్ల
స్ధానిక భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోవింద స్వామి భక్త జన కమిటీ నాయకులు గొలమారి రమణారెడ్డి, హనీమూన్ శ్రీనివాసులు రెడ్డి, చలమారెడ్డి, షరాబు శ్రీనివాస్, గోవిందస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.