నూకసాని బాలాజీని కృతజ్ఞతలు తెలిపిన కనకం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలుగు దేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీని బిసి సేల్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం వెంకట్రావు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు దేశం పార్టీ బిసి సెల్ ప్రకాశం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నన్ను నియమించిన నూకసాని బాలాజీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మువ్వా కాటం రాజు యాదవ్, యేటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు