కంది రైతులను ఆదుకోండి: జంకె
ప్రకాశం భవన్ లో మంగళవారం నాడు ప్రకాశం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను కలసి రైతుల వద్ద నిల్వ ఉన్న కందులను ప్రభుత్వం తో మాట్లాడి తిరిగి కందుల కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని మార్కపురం శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ అధికారులతో, మార్క్ ఫెడ్ అధికారుల వద్ద ఉన్న లెక్కలకు రైతుల వద్ద ఉన్న నిల్వలు తేడాలున్నాయని , దీనివలనే కందుల కొనుగోలు నిలిపి వేశారనే ఆరోపణలు రైతుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని, కావున ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ను కోరారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని స్వయంగా తీసుకెళ్లానని త్వరలో ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే రైతుల వద్ద నిల్వ ఉన్న కందుల కొనుగోలు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారని పొదిలి టైమ్స్ కు తెలియజేశారు. మార్కాపురం నియోజకవర్గంలో నిల్వ ఉన్న కందులన్నీ కొనుగోలు చేయాలని కోరామని త్వరలో ఈ విషయంపై మార్క్ ఫెడ్ ఎం. డి , వ్యవసాయశాఖ కమిషనర్ ను కూడా కలసి ఈ విషయం గురించి చర్చిస్తామని ఒకవేళ కందులు మొత్తాన్ని కొనుగోలు చేయని యెడల ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని , అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరిని ఐక్యం చేసుకుని భారీ ఉద్యమం చేపడతామని జంకె తెలిపారు.