ప్రజా ఆశీర్వాద పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు…
మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి చేపట్టిన అభివృద్ధి చేస్తున్నాం – ఆశీర్వదించండి కార్యక్రమ ముగింపు సభకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వివరాల్లోకి వెళితే పాదయాత్ర ముగింపు సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నాడు ముగింపు సభ నిర్వహించనున్నారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం సాయంత్రం నుండే సభా వేదిక, ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రేపు ప్రజలు వేలాదిగా రనున్నారని అంచనావేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, కుర్చీలు, షామియానాలు, వంటసామాగ్రి మొదలైనవి సమకూర్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ చెప్పిడి రామలింగయ్య, తెదేపా నాయకులు షేక్ రసూల్, తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రామిరెడ్డి, ముల్లా షరీఫ్, ముల్లా జిందాబాషా, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.