కందుల సైకిల్ యాత్ర ప్రారంభం

ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మార్కాపురం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ ఛార్జ్ కందుల నారాయణరెడ్డి తలపెట్టిన సైకిల్ యాత్ర ఆదివారం పొదిలి మండలం మల్లవరం గ్రామ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి నమ్మకం ద్రోహం చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా కాటూరి వెంకట నారాయణ బాబు అధ్యక్షత వహించారు. సైకిల్ యాత్ర మల్లవరం కుంచేపల్లి గొల్లపల్లి మీదుగా సూదనగుంట చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తెలుగు దేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, గునుపూడి భాస్కర్, శామంతపుడి నాగేశ్వరరావు, చప్పిడి రామలింగయ్య, ఆవులూరి కోటేశ్వరరావు, బత్తిన ఓబయ్య ,యాదవ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్, రమణారెడ్డి, షేక్ రసూల్,యస్ఎం భాష, ముల్లా ఖూద్దస్,షేక్ జిలానీ తెలుగు యువత నాయకులు కృష్ణారెడ్డి,ముని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.