కందులపై బిసి బాణం వదిలిన ఇమ్మడి…….
మార్కాపురం టిక్కెట్ బిసిలకు కేటాయించే దిశగా వేగంగా పావులు కదుపుతున్న ఇమ్మడి…….
జయహో బిసి సదస్సులో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర నాయకులను కలిసి కీలకమైన సమాచారం అందజేసిన ఇమ్మడి……
డిసెంబర్ రెండవవారం లోపు బిసి అభ్యర్థిని ప్రకటించే విధంగా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్న ఇమ్మడి…….
మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్ బిసి బాణం ఎక్కుపెట్టారు. తక్షణమే ఇన్చార్జ్ నుండి తొలగించే విధంగా వేగంగా పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు అమరావతి నందు జయహో బిసి డిక్లరేషన్ మహాసభ విజయవంతం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో బిసి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ స్ధాయిలలో గల చైర్మన్లు మరియు డైరెక్టర్లు, పార్టీ రాష్ట్ర స్ధాయి నాయకులు
పాల్గొన్న సమావేశంలో ఇమ్మడి కాశీనాథ్ ఒక కీలకమైన సమాచారాన్ని పార్టీ పెద్దలకు అందజేసి డిసెంబర్ రెండవవారం లోపు మార్కాపురం నియోజకవర్గ టిక్కెట్ వెనకబడిన తరగతులకు (బిసి)లకు కేటాయించాలని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ వివివి చౌదరి, మంత్రులు కళా వెంకట్రావు, తదితరులను కలిశారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా జయహో సదస్సులో కలిసిన అందరు నాయకులతో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీతో కలుపుకుని ఇమ్మడి కాశీనాథ్ కలవడం కొసమెరుపు.