కందుల పాదయాత్రలో పాల్గొన్న కరణం వెంకటేష్
మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద పాదయాత్ర సందర్భంగా కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే కందుల నారాయణరెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద పాదయాత్రకు సంఘీభావంగా చివరి రోజు అయిన మంగళవారంనాడు కరణం వెంకటేష్ పాల్గొని కందులవెంట పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమం చివరిరోజు కావడంతో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొన్నారు.