అక్రమంగా అన్ లైన్ లో పేర్లు తొలగింపుపై తహశీల్దారు విచారణ జరిపించాలని కందుల డిమాండ్
కొనకనమీట్ల మండలం పరిధిలోని నాగరాజుకుంట, పాతపాడు,తువ్వపాడు, సహ ప్రతి గ్రామంలో గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు తొలగించి ఇతరుల పేర్లు నమోదు చేయడంపై తహశీల్దారు విచారణ జరిపించి న్యాయం చేయాలని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి కోరారు.
శనివారం నాడు కొనకనమీట్ల మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయంకు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ బృందం తహశీల్దారు రాధాకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు మూరబోయిన బాబూరావు, తర్లుపాడు మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, మార్కాపురం మండల అధ్యక్షులు జువ్వాజీ రామాంజనేయరెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూల గోపీనాథ్ చౌదరి, నాయకులు సాదం వీరయ్య, స్థానిక నాయకులు వేంపాటీ శ్రీకాంత్ రెడ్డి, మరియు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.