పట్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుమ్మరి సరేలో పాల్గొన్న కందుల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంన్చర్జ్ కందుల నారాయణరెడ్డి తలపెట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర నాలుగవ రోజున స్దానిక పెద్దరికట్ల గ్రామంలో తెలుగు దేశం పార్టీ శాలివాహన కుమ్మరి సాధికారత సమితి ప్రకాశం జిల్లా కన్వీనర్ సీనియర్ జర్నలిస్ట్ పట్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తలపెట్టిన కుమ్మరి సారె కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.
అనంతరం కుమ్మరి వృత్తి వారి యొక్క తాజా స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని శాలివాహన కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు