మీడియా ప్రతినిధులపై కేసుల నమోదు పట్ల తీవ్రంగా ఖండించిన కందుల

                   మీడియా ప్రతినిధులపై కేసుల నమోదు చెయ్యడం పై మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి తీవ్రంగా ఖండించారు.

పొదిలి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇటివల హిందు ఆలయాలను లక్ష్యం చేసుకొని జరుగుతున్న దాడులను వార్త రూపం తెలియజేస్తున్నా మీడియా ప్రతినిధుల ఉక్కుపాదంతో అణచివేతకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతుందిని అన్నారు

తక్షణమే మీడియా ప్రతినిధులపై నమోదు చేసిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ మీడియా ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు

                              ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం , టి యన్ యస్ యఫ్ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, తెలుగు దేశం పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మండల తెలుగు దేశం పార్టీ నాయకులు సమంతపూడి నాగేశ్వరరావు, ఆవులూరి యలమంద, షేక్ రసూల్, సయ్యద్ ఇమాంసా, మీగడ ఓబుల్ రెడ్డి, జ్యోతి మల్లి, సోమయ్య,భూమ సుబ్బాయ్య, షేక్ యాసిన్, షేక్ మౌలాలి, బాదం రవి, షేక్ నజిర్, షేక్ సంధాని, తదితరులు పాల్గొన్నారు