విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన కరిముల్లా బేగ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి పోటీల్లో విజేతలకు హాబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్ బహుమతులను ప్రదానం చేశారు.

గురువారం నాడు స్ధానిక విశ్వశాంతి విద్యాలయం నందు నిర్వహించిన చెకుముకి పోటీల్లో విజేతలకు ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి గోల్డ్ మెడల్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక నాయకులు జి శ్రీనివాసులు, జె వెంకటేశ్వర్లు, పివి కొండయ్య, జి ఐజాక్, యలమంద రెడ్డి, ఆంజనేయ చౌదరి,యు టి యఫ్ నాయకులు కామేశ్వరరావు మరియు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు