పొగాకు కొనుగోలులో కర్నాటక విధానం అమలు చేయాలి-బిజెపి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొగాకు కొనుగోలులో కర్నాటక విధానం అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు శశి భూషణ్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి పొగాకు వేలం కేంద్రం నందు భారతీయ జనతా పార్టీ నాయకులు పర్యటించి పొగాకు రేట్లు పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని వారు తెలిపారు.

కందుకూరు కనిగిరి ప్లాట్ ఫామ్ లో రేట్లు ఎక్కువగా వేస్తున్నారు పొదిలికి మాత్రం రేట్లు తక్కువగా వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

పొదిలిలో 22700, కనిగిరి కందుకూరులో 24000 వేస్తున్నారు జిల్లాలో నాణ్యమైన పొగాకు పొదిలి పరిసర ప్రాంతాలలోనే పడుతుందని మాకు రేటు తక్కువ వేస్తున్నారని రైతులు వాపోతున్నారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు బ్రహ్మయ్య ప్రసాద్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉన్నం శ్రీనివాసులు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మాకినేని అమరసింహ తదితరులు పాల్గొన్నారు