కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది భక్తులతో కిటకిలాడిన శివాలయం
దర్శనం కోసం బారులుతీరిన భక్తులు
ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిన దీపాలు అలంకరణ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున నుండి శివాలయం భక్తులతో కిటకిటలాడుతుంది వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. పెద్ద సంఖ్యలో శివాలయంకు తరలివచ్చారు.
దర్శనం కోసం బారులుతీరిన భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు ఉసిరి, రావి చెట్టులకు పూజలు నిర్వహించారు.
పెద్ద ఎత్తున వేలాదిగా హాజరైన భక్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది
భక్తుల సౌకర్యం అర్ధం రెండు పుటల అన్నదానం కార్యక్రమన్ని ఉత్సవాలు కమిటీ ఏర్పాటు చేసింది. రద్దీ దృష్ట్యా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఆహ్వానం కమిటీ నాయకులు కంకణల రమేష్ కల్లం వెంకట సుబ్బారెడ్డి జి శ్రీనివాసులు కొత్తురి శ్రీనివాస్ సత్యం భూమ రమేష్ గుద్దేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు