బెల్లంకొండ నందు కిషోరి వికాసం సదస్సు
పొదిలి మండలంలోని కంభాలపాడు బెల్లంకొండ విద్యాసంస్థ నందు కిశోరి బాలల వికాసం ఫేస్-2 సదస్సు నిర్వహించారు. సీడీపీఓ కృష్ణవేణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బాలల హక్కులు విఘాతం కల్గించడం, బాల్య వివాహ నిరోధక చట్టం 2006, ప్రేమ పెళ్ళిళ్ళు, లైంగిక వేధింపులు, వెట్టిచాకిరి, శ్రమ దోపిడీ చట్టాలను గురించి వివరించి హక్కులకు విఘాతం (భంగం) కలిగినప్పుడు ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలి అనే అంశాలను విద్యార్థులకు వివరించి, సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, ఎంపీపీ నరసింహారావు, బెల్లంకొండ విద్యాసంస్థల అధినేతలు బెల్లంకొండ శ్రీనివాసరావు, బెల్లంకొండ విజయలక్ష్మి, ప్రభుత్వ వైద్యాధికారిణి సాయి లీలావతి, షీ (సఖి) టీమ్, మండల పరిషత్ కో-అప్షన్ సభ్యులు మస్తాన్ వలి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.