దివ్యాంగ విద్యార్థులకు భోదనాబ్యాస కిట్ల పంపిణీ
దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి మరియు పునరావాస సాధికారత సమ్మేళిత ప్రాంతీయ కేంద్రం నెల్లూరు వారి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు భోదనాబ్యాస కిట్లను పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి మరియు పునరావాస సాధికారత సమ్మేళిత ప్రాంతీయ కేంద్రం నెల్లూరు వారి ఆధ్వర్యంలో ప్రకాశంజిల్లా సహిత విద్యావిభాగం సహకారంతో స్థానిక భవిత పాఠశాలనందు దివ్యాంగ ఎస్సి, ఎస్టీ, విద్యార్థులకు భోదనాభ్యాస ( టిఎల్ఎం)కిట్లను పంపిణీ చేశారు.
పొదిలి మండల విద్యాశాఖ అధికారి రఘురామయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పునరావాస అధికారి ఈశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరమైన భోదనాభ్యాస కిట్లను పంపిణీ చేయడంద్వారా వారు సాధారణ విద్యార్థులవలె విద్యను అభ్యసించగలరని ఒక్కొక్కటి 10వేల రూపాయలు విలువగల కిట్లను 32మంది విద్యార్థులకు అందజేయడం జరిగిందని…. విద్యార్థులు ఈ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. జూన్ నెలలో మిగిలిన బిసి, ఓసి విద్యార్థులకు కూడా ఈ కిట్లను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సార్వశిక్షా అభియాన్ జిల్లా సహిత విద్యా సమన్వయ కర్త మరియు సి ఆర్ సి సుదామాధురి, జిల్లా సహిత విద్యా సహాయ సమన్వయ కర్త జగన్నాథరావు, నెల్లూరు అధికారులు రఘునాధ్, శ్రావణ్, సహిత విద్యాబోధకులు గోపాలకృష్ణ, మాలిక్, శ్రీను, క్రాంతి కుమార్, సంపతమ్మ, నరసింహారావు, షాహిదాబేగం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.