ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్న యస్ కొండయ్య

పొదిలి ఆర్టీసీ డిపో నందు హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న యస్ కొండయ్య ఉత్తమ నిఘా పర్యవేక్షకుడుగా ప్రశంసా పత్రాన్ని డిపో మేనేజర్ చేతుల మీదుగా అందుకున్నారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు ఉత్తమ సేవాలు అందిస్తున్నా ఉద్యోగాలను ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గుత్తి విజయగీత ఎంపిక చేసి వారికి ప్రశంసా పత్రాలను స్థానిక డిపో మేనేజర్ గిరిబాబు చేతుల మీదుగా అందజేశారు.

నిఘా పర్యవేక్షకుడుగా ప్రశంసాపత్రం అందుకున్న కొండయ్య ను పలువురు అభినందించారు.