ఎసిబి వలలో కొనకనమిట్ల యస్ఐ దీపికా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల యస్ఐ దీపికా ,కానిస్టేబుల్ నరసింహారావు ఎసిబి వలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది.
ఒక కేసు విషయంలో చార్టషిట్ లో ముగ్గురి పేర్లు తొలగిస్తే క్రమంలో కొనకనమిట్ల యస్ఐ దీపక 60 వేల రూపాయలు డిమాండ్ చేయగా 45 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని సంబంధించిన బాధితులు ఎసిబి అధికారులు సంప్రదించి ఫిర్యాదు చేయగా సదరు ఎసిబి అధికారులు బుధవారం నాడు కొనకనమిట్ల పోలీసు స్టేషన్ కు చేరుకొన్నరు
బాధితుడు 45 వేలు రూపాయలు తీసుకుని యస్ఐ దీపికా ను సంప్రదించంగా కోర్టు పని పై పొదిలి వెళ్తున్న కానిస్టేబుల్ నరసింహారావు కు నగదు ఇమ్మని తెలిపి పొదిలికి బయలుదేరి వెళ్ళగా తదుపరి కానిస్టేబుల్ నరసింహారావు కు 45 వేల రూపాయలు ఇవ్వగా అతను సదరు నగదు తీసుకొని పొదిలి పట్టణంలోని మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న యస్ఐ దీపికా అందజేయడం వెనువెంటనే ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకొని వారిని కొనకలమిట్ల పోలీస్ స్టేషన్ తరలించి సంబంధిత ప్రక్రియ పూర్తి చేసి అరెస్టు చేసి రేపు ఎసిబి కోర్టు హాజరుపర్చనట్లు ఎసిబి డిఎస్పీ వి శ్రీనివాస్ రావు మీడియాకు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎసిబి అధికారులు తదితరులు పాల్గొన్నారు