ఘనంగా కుందూరు జన్మదిన వేడుకలు
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్ధానిక విశ్వనాథపురం వైయస్సార్ విగ్రహాం వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గొలమారి చెన్నారెడ్డి నాయకత్వం ఏర్పాటు చేసిన కేక్ ను ముఖ్య అతిథిగా హాజరైన సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
అనంతరం స్థానిక చిన్న బస్టాండ్ వైయస్సార్ విగ్రహాం వద్ద ఎఎంసి చైర్మన్ గుర్రపుశాల కోటేశ్వరి, కల్లం వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కోటేశ్వరి, నూర్జహాన్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం స్థానిక పంచాయతీ రాజ్ శాఖ ఆవరణలో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.కాటూరి వారి పాలెం వైయస్సార్ విగ్రహాం వద్ద కాటూరి అశోక్, కాటూరి ప్రసాద్ లో జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎఎంసి చైర్మన్ గుర్రపుశాల కోటేశ్వరి, వైకాపా నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, జి శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి, జిల్లా మైనారిటీ విభాగం కార్యదర్శి షేక్ నూర్జహాన్,పట్టణ అధ్యక్షులు షేక్ రబ్బానీ, మండల యువజన విభాగం అధ్యక్షులు వర్షం ఫీరోజ్ , మండల నాయకులు కొత్తూరి శ్రీనివాస్ భూమ రమేష్, యర్రం వెంకటరెడ్డి, ఉడుమల పిచ్చిరెడ్డి, దర్నాసి రామారావు, ముల్లా జిందాభాష, మీగడ ఓబుల్ రెడ్డి, కోగర వెంకట్రావు యాదవ్, ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ జూపల్లి ఏడుకొండలు, మహిళా నాయకురాలు షేక్ గౌసియా మరియు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు