కోవిడ్ సెంటర్ ఏర్పాటుకై ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన శాసనసభ్యులు కుందూరు
పొదిలి పట్టణంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకై స్థానిక ప్రభుత్వ వైద్యశాలను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి సందర్శించి ప్రత్యేకంగా కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు కావలసిన మౌళిక సదుపాయాలు మరియు అవసరమైన సిబ్బంది వివరాలు స్థానిక ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ వైద్యశాల నందు నిర్వహిస్తున్న కోవిడ్ పరీక్షల వివరాలు మరియు వ్యాక్సిన్ ప్రక్రియ యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రభుత్వ వైద్యశాల నందు వార్డులను సందర్శించారు.
రెండు మూడు రోజుల్లో సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసి కోవిడ్ సెంటర్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ సందర్శించిన లో ప్రభుత్వం వైద్యశాల వైద్యులు డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ వడ్డే నరేంద్ర, డాక్టర్ రఫీ మరియు వైద్య సిబ్బంది , వైకాపా నాయకులు గూడురి వినోద్ తదితరులు పాల్గొన్నారు