విద్యాభివృద్ధిలో లాల్ ఫౌండేషన్ సహకారం హర్షణీయం

విద్యాభివృద్ధిలో లాల్ ఫౌండేషన్ సహకారం హర్షణీయమని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా ఏర్పాటు చేసిన ప్రాధమిక విద్య – పరిరక్షణ సదస్సు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల విద్యాభివృద్ధికి లాల్ ఫౌండేషన్ నిర్వాహకులు చేస్తున్న కృషి హర్షణీయమని….. అలాగే విద్యాభివృద్ధిలో భాగంగా ఉపాధ్యాయులందరూ అంకితభావంతో పని చేసి విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు.

ఈ సందర్భంగా లాల్ ఫౌండేషన్ నిర్వాహకులు ఆరిఫ్ అహమ్మద్ మాట్లాడుతూ మండలంలోని పాఠశాలల ప్రాధమిక విద్యా పరిరక్షణకు లాల్ ఫౌండేషన్ సదా కృషి చేస్తుందని….. విద్యార్ధులతో పాటుగా వారి తల్లిదండ్రులు పాఠశాలల ఉపాధ్యాయులు అంకితభావంతో కృషిచేసినప్పుడే ప్రాధమిక విద్య పరిరక్షణ సాధ్యమని…… ప్రతి గ్రామంలో తల్లిదండ్రులతో ఒక కమిటీని నియమించి సలహాలు సూచనలతో అభివృద్ధి చేపడతామని అన్నారు.

జనవిజ్ఞాన వేదిక పొదిలి డివిజన్ అధ్యక్షులు దాసరి గురుస్వామి, వెన్నెల మల్లిఖార్జునరావులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పనిభారం పెరగడం వలనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నారని అన్నారు.

అనంతరం పాఠశాల గ్రంధాలయానికి లాల్ ఫౌండేషన్ సహకారంతో బల్లలు, పుస్తకాలు, లాప్ టాప్ కంప్యూటర్ ఏర్పాటు చేసి….. మేడం సుబ్బారెడ్డి రచించిన గణితమేధస్సు పుస్తకాన్ని ఆవిష్కరించారు…… అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, నారాయణరెడ్డి, దాసరి గురుస్వామి, వెన్నెల మల్లికార్జునరావులను లాల్ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ చైర్మన్ ఆఖిబ్ అహమ్మద్, మేడం సుబ్బారెడ్డి, దంటు నరసింహారావు, వెంకటేశ్వరరావు, చెంచునారాయణ మరియు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.