రోడ్డు రద్దీ ప్రాంతాల్లో అద్దాలు ఏర్పాటు చేసిన లాల్ ఫౌండేషన్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణంలోని పలు రద్దీ ప్రాంతాల్లో లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దాలు ఏర్పాటు చేశారు.
శనివారం నాడు స్థానిక పొదిలి పట్టణంలో రోడ్డు మలుపులు ఎక్కువగా ఉండే మార్కాపురం క్రాస్ రోడ్, చిన్న బస్టాండ్ సెంటర్లో లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ మలుపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అద్దాలు ఏర్పాటు చేసిన లాల్ ఫౌండేషన్ వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ శ్రీహరి,లాల్ ఫౌండేషన్ చైర్మన్ అఖిబ్ అహ్మద్, ఎన్ఆర్ఐ ఫకృద్దిన్ ,ఇమాంసా తదితరులు పాల్గొన్నారు