మహిళా సాధికారత పాటుపడుతున్న లాల్ ఫౌండేషన్ : ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి
మహిళా సాధికారత కోసం లాల్ ఫౌండేషన్ పట్టుబడటం అభినందనీయమని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి అన్నారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక విశ్వనాధపురం నందు లాల్ ఫౌండేషన్ నూతన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం లాల్ ఫౌండేషన్ చైర్మన్ అఖిబ్ అహమ్మద్ అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ కరోనా సమయం లో నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు పంపిణీ, గత సంవత్సరం నుంచి నిత్యఅన్నదానం కార్యక్రమం కొనసాగింపు, విద్యార్థులకు ఆర్థిక చేయుత, ఆక్సిజన్ మిషన్ల ఏర్పాటు, మొదలు సేవలను ఆమె కొనియాడారు.
అనంతరం పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 29 అంగనవాడి కేంద్రాలకు కుర్చీలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గురుస్వామి ,పొదిలి సిడిపిఓ ఫణీరాజకుమరి, ఈఓఆర్డీ రాజశేఖర్, ప్రభుత్వం వైద్యులు షాహీదా , షేక్ రఫీ, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులురెడ్డి, నాగర్ వలి , ముల్లా జిలానీ, సంస్థ నిర్వాహకులు అలీం తదితరులు పాల్గొన్నారు