లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు, నోటు పుస్తకాలు పంపిణీ…..
పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఉర్దూ పాఠశాలలోని విద్యార్ధులకు లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు, నోటు పుస్తకాలు మరియు పెన్ లను పంపిణీ చేసి….. తూర్పుపాలెం అంగన్వాడీ పాటశాలలోని చిన్నారులకు ఆటవస్తువులను అందజేశారు.
ఈ సందర్భంగా లాల్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఎ ఖయ్యుం మాట్లాడుతూ ప్రభుత్వ ఉర్దూ పాటశాలలో విద్యార్థులు సౌకర్యంగా అలాగే పోటీతత్వంతో చదువులలో రాణించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఉర్దూ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి మరియు నోటు పుస్తకాలు, పెన్ లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ సభ్యులు అఖిబ్ అహమ్మద్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.