న్యాయవాది భూమి కబ్జా…. ముగ్గురిపై కేసు నమోదు
ఒంగోలు గోపాల్ నగర్ కు చెందిన షేక్ మహబూబ్ బాషా అనే న్యాయవాదికి చెందిన పొదిలి గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ 219-1నందు గల 65సెంట్ల భూమిని దమ్మలపాటి పాపారావు, షేక్ శాతాజ్ బేగం, షేక్ హుస్సేన్ బి, అనే ముగ్గురు ఆక్రమించుకుని పెద్ద వృక్షాలను నరికివేసి ఆస్తినష్టం కలిగించడమే కాకుండా చంపుతామని బెరిదిరిస్తున్నారనే ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.