శనివారం నాటి కోవిడ్ పాజిటివ్ కేసుల వివరాలు అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు
పొదిలి పట్టణంలో నేడు 8 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు తో మొత్తం యాక్టివ్ కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య 24కు చేరింది.
రోజుకు రోజుకు పెరుగుతున్న కేసుల దృష్ట్యా శనివారం నాడు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం మండల టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు
అనంతరం పట్టణం లో కంటోన్మెంట్ రెడ్ జోన్ లో నందు అధికారులు పర్యటించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, మండల వైద్యాధికారిణి షేక్ షహీదా ,నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తదితరులు పాల్గొన్నారు