డిజిటల్ ఇంటి పన్నుల చెల్లింపు కేంద్ర ప్రారంభం
పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు డిజిటల్ ఇంటి పన్నుల చెల్లింపు కేంద్రాన్ని సోమవారం నాడు నగర పంచాయితీ కమీషనర్ డానియల్ జోసప్ లాంఛనంగా ప్రారంభించారు.
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని ఇంటి పన్నులను డిజిటలైజేషన్ పూర్తి చేసి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి డిజిటల్ రూపంలో పన్నులు చెల్లించే విధంగా ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసామని పట్టణ పౌరులు కౌంటర్ నందు ఇంటి పన్నులు చెల్లింపు చేయాలని కమిషనర్ డానియల్ జోసప్ కోరారు.
ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, వార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మరియు నగర పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు