మానవ అక్రమ రవాణా నిర్మూలన కరపత్రం ఆవిష్కరణ
మానవ అక్రమ రవాణా నిర్మూలన కరపత్రంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు రమాదేవి ఆవిష్కరించారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక ప్రకాశం జిల్లా పొదిలి స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి డిగ్రీ కళాశాల నందు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మానవ అక్రమ రవాణా నిర్మూలన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి మాట్లాడుతూ యువతీ యువకులు ఏ విధంగా అక్రమ రవాణాకు గురి అవుతున్న అంశం మరియు అక్రమ రవాణా గురయిన పిల్లలను భిక్షాటనకు ఉపయోగిస్తారని తదితర అంశాల గురించి వివరించారు.
న్యాయ సేవ సహాయకురాలు లక్ష్మి మాట్లాడుతూ అక్రమ రవాణా ఐదు రకాలుగా జరుగుతుందని, మహిళలకు ఉన్న చట్టాలను మరియు ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న సెక్షన్లను వివరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, సిడిపిఓ ఇందిరా కుమారి, కళాశాల కరస్పాండెంట్ జి సుబ్బారావు , ఉపాధ్యాయలు సునీల్ కుమార్ , కిషోర్ కుమార్ , న్యాయ సేవ సహాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.