ఎజిపి గా న్యాయవాది షబ్బీర్ ఎంపిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా తనను నియమించినట్లుగా షేక్ షబ్బీర్ సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
గత 23 సంవత్సరాలుగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్న షేక్ షబ్బీర్ కు అదనపు ప్రభుత్వ న్యాయవాది గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు షేక్ షబ్బీర్ సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు