పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద న్యాయవాదులు ధర్నా

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద న్యాయవాదులు నల్ల రిబన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత బార్ అసోసియేషన్ గురువారం నాడు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించలనే పిలుపు మేరకు పొదిలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ చట్ట సభలు ద్వారా సంక్రమించిన న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్రం నల్లగొండ నందు న్యాయవాది విజయారెడ్డి హత్యాను తీవ్రంగా ఖండించారు.

తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని లేకపోతే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో పొదిలి బార్ అసోసియేషన్ నాయకులు వరికుటి నాగరాజు,యస్ ఎం బాషా, షేక్ షబ్బీర్, బోడగిరి వెంకటేశ్వర్లు, రాంబాబు, శ్రీనివాస్, నాయబ్ రసూల్ ,బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు