అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు

పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ సాధన కై తలపెట్టిన ఉద్యమం రెండవ రోజుకు చేరుకుంది.

మంగళవారం నాడు స్థానిక ఎబియం స్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు.

అనంతరం పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు మాట్లాడుతూ పొదిలి రెవెన్యూ డివిజన్
ఏర్పాటు అధికార ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు

రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఉద్యమం లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి అధ్యక్షులు గునుపూడి భాస్కర్, సాధన సమితి నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు, పొల్లా నరసింహా యాదవ్ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,దర్నాసి పెద్దన్న,వరికూటి నాగరాజు,బాదుల్లా, అమర్ సింహా,సామి పద్మావతి,అవూలూరి యలమంద, కాటూరి నారాయణ ప్రతాప్, కనకం వెంకట్రావు యాదవ్, దాసరి మల్లి, బండి అశోక్,షేక్ రసూల్, మీగడ ఓబుల్ రెడ్డి, షేక్ జిలానీ భాషా, సామంతపూడి నాగేశ్వరరావు, షేక్ గౌస్ బాషా, పెమ్మని అల్లూరి సీతారామరాజు,ఎండి గౌస్, రమణ కిషోర్, తోట మోహన్, ముని శ్రీనివాస్, కాటూరి శ్రీను షేక్ మస్తాన్ వలి, చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు