ఓమిక్రాన్ వైరస్ పట్ల వ్యాపారస్తులకు అవగాహన కల్పించిన శాసనసభ్యులు
పొదిలి పట్టణం నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి వ్యాపారస్తులకు ఓమిక్రన్ వైరస్ పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన వ్యాపారస్తులు తో మాట్లాడుతూ తూ ప్రతి ఒక్కరూ మాస్కు తప్పని సరిగా ధరించాలి అని సామాజిక దూరం పాటించాలని వ్యాపారస్తులు మాస్క్ పెట్టుకోని వారికి సరుకులు అమ్మ వద్దని షాప్ వద్ద శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు
కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అల్లా పాటించని యెడల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్టణంలోని వ్యాపార సంస్థలు అందరికీ కోవిడ్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే 25 వేల రూపాయలు జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ,ఈఓఆర్డీ రాజశేఖర్, ప్రభుత్వం వైద్య అధికారిణి షేక్ షాహీదా, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు