కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు కుందూరు

కొత్తగా మంజూరైన పెన్షన్లు మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పంపిణీ చేశారు.

బుధవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో నందు ఏర్పాటు చేసిన వైఎస్సార్ పింఛను కానుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కొత్తగా మంజూరైన పెన్షన్లు పంపిణీ చేశారు.

పొదిలి మండలం మొత్తం 246 పెన్షన్లు మంజూరు కాగా వారికి ఈ కార్యక్రమంలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ మరియు మండల పరిషత్, మున్సిపల్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు