మలేరియా సమూల నిర్మూలనకు కృషి చేద్దాం : డాక్టర్ చక్రవర్తి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం మేరకు మలేరియాను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన బాధ్యత ఉందని పొదిలి ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి అన్నారు.
మంగళవారంనాడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితో కలిసి నిర్వహించిన ర్యాలీని డాక్టర్ చక్రవర్తి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ మలేరియా నిర్మూలనకు నూతన ఆవిష్కరణలను అమలు చేయడం ద్వారా, సున్నా మలేరియా చేరుటకు సమయం ఆసన్నమైందన్ని 2030 నాటికి మలేరియాను పారదోలటానికి దోమలు పుట్టకుండా, కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని, నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని నీటి తొట్టెలపై మూతలు ఉంచాలని, దోమల కొట్టకుండా ప్రతి ఒక్కరు దోమతెరలు వాడాలని సూచించారు.
చిన్న దోమ-పెను ప్రమాదం, మలేరియా రహిత సమాజం-మన అందరి బాధ్యత, నీటి నిల్వలు-దోమల ఆవాసాలు, దోమల నిర్మూలిద్దాం- మలేరియాను తరిమికొడదాం, చేయి చేయి కలుపుదాం-మ లేరియాను నివారిద్దాం, దోమలపై దండయాత్ర- ఆరోగ్యం పై జైత్ర యాత్ర నినాదాలతో ర్యాలీ చేస్తూ కరపత్రాలు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ టి. సుష్మ, డాక్టర్ ఎం. సుగుణ కుమార్, సబ్ యూనిట్ అధికారి పి బ్రహ్మానందం, ఆరోగ్య విస్తరణ అధికారి పి శ్రీనివాసరావు, సూపర్వైజర్లు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు సచివాలయ సి హెచ్ ఓలు,ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు