అంతర్జాలంలో యల్ఐసి వ్యాపారం పట్ల యల్ఐసి ఏజెంట్లు ధర్నా
అంతర్జాలంలో యల్ఐసి సేవాలను నిరసిస్తూ యల్ఐసి ఏజెంట్లు ధర్నా చేపట్టారు.
వివరాల్లోకి వెళితే ఎల్ఐసి ఏజెంట్లు జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా మంగళవారం నాడు ఎల్ఐసి కార్యాలయల వద్ద నిరసన కార్యక్రమాలు చెయ్యాలని ఇచ్చిన పిలుపుమేరకు స్థానిక పొదిలి ఎల్ఐసి కార్యాలయల వద్ద ఎల్ఐసి ఏజెంట్లు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఏజెంట్లు మాట్లాడుతూ ఆల్ ఇండియా లియోఫి పిలుపు మేరకు మార్కాపురం లియోఫి ఆధ్యరంలో పొదిలి నందు ఏజెంట్ల సమస్య ల ఫై నిరసన తెలుపుతున్నామన్నారు. ఆన్ లైన్ మార్కెటింగ్ నిలిపివేయాలని, అలాగే పాలసీ దారులకు బోనస్, ఏజెంట్లకు గ్రాట్యుటీ, గ్రూపు ఇన్సూరెన్స్, మెడి క్లెయిమ్ పెంచాలని కోరారు. ఏజెంట్ల ఎదుగుదలకు కార్పొరేషన్ సహకరించాలని నాయకులు కోరారు