ఎల్ఐసి ఏజెంట్ల దినోత్సవం సందర్భంగా పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ
ఎల్ఐసి ఏజెంట్ల వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ సామాజిక వైద్యశాల నందు ఎల్ఐసి ఏజెంట్లు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే స్థానిక పొదిలి భారత జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రారంభించి 65సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ప్రభుత్వ సామాజిక వైద్యశాల నందు రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పొదిలి ఎల్ఐసీ బ్రాంచి మేనేజర్ మాట్లాడుతూ ఎల్ఐసీ ప్రారంభించిన మొదటి సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1నుండి 7వతేది వరకు ఎల్ఐసీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని….. పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని…. అందులో భాగంగానే ఈరోజు రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగిందని… ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ చక్రవర్తి, రఫీలకు ధన్యవాదాలు తెలిపారు.