పెదారికట్ల హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ జైలు శిక్ష – పొదిలి సిఐ సుధాకర్ రావు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
గత సంవత్సరం 2021 ఆగస్టు 25వ తేదీన కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల గ్రామం లోని యస్సీ కాలనీ లో కనిగిరి మండలం యడవల్లి గ్రామానికి చెందిన కొత్త వెంకటేశ్వర రావు(45) మద్యం దుకాణం నకు అతని స్నేహితునితో వెళ్లి మద్యం సేవిస్తుండగా ముద్దాయి కొత్త పుల్లారావు వారి పాత కక్ష్య లను మనసులో వుంచుకొని పథకం ప్రకారం మద్యం సీసా పగలగొట్టి మృతుని పై దాడిచేసి కంఠం పైన మరియు దేహం పైన విచక్షణా రహితంగా మద్యం సీసా తో బలంగా పొడిచి చంపిన విషయమై , మృతుని భార్య శ్రీమతి ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొనకణమిట్ల పోలీస్ స్టేషన్ లో Cr No 163/2021 U/sec 302 IPC గా కేసు నమోదు కాబడిఉన్నది.
ఈ హత్య కేసులో ప్రకాశం జిల్లా యస్పీ మాలిక గార్గ్ ఆదేశాలతో దర్శి డియస్పీ నారాయణ స్వామి రెడ్డి పర్యవేక్షణ లో పొదిలి సిఐ సుధాకర్ రావు కోనకనమిట్ల యస్ఐ ఫణి భూషణ్ మరియు పోలీసు సిబ్బంది ఈకేసులో ప్రత్యేక శ్రద్ద కనబరచి త్వరితగతిన ముద్దయిని అరెస్టుచేసి పిపి గారి సహాయంతో సాక్ష్యాలను గౌరవ జడ్జి గారి ఎదుట సకాలం లో హాజరు పరచి వారిచేత సాక్ష్యం చెప్పించడం వలన గౌరవ 6వ అడిషనల్ జిల్లా కోర్టు మార్కాపురం కోర్టు జడ్జి వారు ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు 1000/- రూపాయల జరిమానా ను విధించడం జరిగిందని
అలాగే ఈ కేసులో ప్రత్యేక శ్రద్ద కనపరచి ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన పొదిలి సిఐ సుధాకర్ రావు ను ప్రకాశం జిల్లా యస్పీ మాలిక గార్గ్ అభినందించారు