యల్ యల్ ఆర్ మేళాను వినియోగించుకోండి:

మర్రిపూడి మండలంలోని గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం ఉదయం దర్శి రవాణా శాఖ వారు యల్ యల్ ఆర్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18సంవత్సరాలు నిండినవారుఆధార్ కార్డుతో మీ సేవ, ఈ సేవ, లేదా సియస్సీ సెంటర్లు ద్వారా యల్ యల్ ఆర్ మేళా టోకెన్ నంబరు 656435తో పరీక్షకు బుక్ చేసుకోవచ్చునని దర్శి రవాణాశాఖ (మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్) వారు తెలిపారు.