కార్యకర్తలకు అండగా ఉంటా…. స్ధానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్యంగా పని చేద్దాం : కందుల
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని మార్కాపురం నియోజకవర్గం నుండి పోటి చేసిన అభ్యర్థి కందుల నారాయణరెడ్డి అన్నారు.
వివరాల్లోకి వెళితే సాధారణ ఎన్నికలలో ఓటమి చవిచూసిన అనంతరం మొదటిసారిగా పొదిలి మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో బుధవారంనాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ రానున్న స్ధానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేసి విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అదేవిధంగా వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లను అలాగే ఉపాధిహామీ సహాయకులను, అంగన్ వాడి కార్యకర్తలను వేధించడం సరైనపద్దతి కాదని వారిని వేధింపులకు గురిచేయడం అపకపోతే వారికి అండగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాకర్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మాకినేని నారాయణరావు, తెదేపా నాయకులు గునుపూడి భాస్కర్, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవులూరి కోటేశ్వరరావు, సామంతపూడి నాగేశ్వరరావు, సయ్యద్ ఇమాంసా, షేక్ రసూల్, ముల్లా ఖుద్దుస్, మండలంలోని నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.