ప్రజా చైతన్య పాదయాత్రకు మద్దతు తెలిపిన లోక్ సత్తా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంన్చర్జ్ కందుల నారాయణరెడ్డి తలపెట్టిన ప్రజా చైతన్య పాదయాత్రకు లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మద్దతు తెలిపారు.
నాలుగవ రోజున స్దానిక పెద్దరికట్ల గ్రామంలో తెలుగు దేశం పార్టీ శాలివాహన కుమ్మరి సాధికారత సమితి ప్రకాశం జిల్లా కన్వీనర్ సీనియర్ జర్నలిస్ట్ పట్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తలపెట్టిన కుమ్మరి సారె పాల్గొన్న చంద్రశేఖర్ అనంతరం నాలుగవ రోజు పాదయాత్రలో నారాయణరెడ్డి తో కలిసి ప్రయాణం చేసారు.