లారీ ఢీకొని ఆటో బోల్తా ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
లారీ ఢీకొని ఆటో బోల్తా పడి ముగ్గురికీ తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమమైన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి నుండి కంభాలపాడుకు పెళ్లి సమాన్లతో వెళ్తున్న ఆటోను కంభాలపాడు సమీపంలోనని వెంకటేశ్వర డిఈడి కాలేజి వద్ద వెనుకవైపు నుండి ఆయిల్ ట్యాంకర్ లారీ ఢీకొనడంతో ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న కాగూరి పేరయ్య, ఆటో డ్రైవర్ మల్లి, హరి, నేలటూరి విజయ్ లు తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులను స్ధానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం గాయపడిన వారిలో పేరయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం ఒంగోలు తరలించారు.