కరోనా కష్టాలకు లక్ష రూపాయలు విరాళం అందజేసిన వరమ్మ దంపతులు

కరోనా కష్టాలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతికి ఉడముల పిచ్చిరెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు వరమ్మ దంపతులు అందజేశారు.

వివరాల్లోకి వెళితే విశ్రాంత ఉపాధ్యాయులు ఉడుముల వరమ్మపిచ్చిరెడ్డి మనవళ్లు మేరువ విఖ్యాత్ రెడ్డి, ఉడుముల సూర్యాన్ష్ రెడ్డిలు మే నెలలో జరుపుకునే జన్మదిన వేడుకలను కనుకగా లక్ష రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి పేరున తీసిన చెక్కును మంగళవారంనాడు స్థానిక మాజీ శాసనసభ్యులు ‌ఉడుముల శ్రీనివాసులరెడ్డి స్వగృహంలో ఆయన సమక్షంలో అందజేసినట్లు సామాజిక మాధ్యమం ద్వారా పొదిలి టైమ్స్ కు తెలిపారు.