అంగరంగ వైభవంగా మాదాలవారిపాలెం నాసర్ వలి దర్గా ఉరుసు మహోత్సవం
ఊరేగింపుగా దర్గాకు చేరుకున్న జెండాలు
వేలాదిగా మొక్కులు తీర్చుకున్న భక్తులు
సాంస్కృతిక కార్యక్రమాలకు సిద్దమైన మూడు విద్యుత్ ప్రభలు
మాదాలవారిపాలెం నాసర్ వలి దర్గా ఉరుసు మహోత్సవం సందర్భంగా శనివారంనాడు విద్యుద్దీప అలంకరణలతో దర్గాను సుందరంగా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా ఉదయం నుండి రాత్రివరకు వివిధ ప్రాంతాల భక్తులు జెండాలను తీసుకుని మాదాలవారిపాలెం గ్రామానికి చేరుకున్నారు. ఉరుసు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దర్గానందు వేలాదిగా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా తమ గ్రామానికి విచేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్థులు ప్రత్యేక ఆతిధ్య ఏర్పాట్లు చేశారు. భక్తుల వినోదంకోసం ప్రతి సంవత్సరంలానే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు 3విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు.
అలాగే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.