మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైసీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల వైసిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణ వైసీపీ నాయకులు గూడూరి వినోద్ ఆధ్వర్యంలో మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక ఏబిఎం పాఠశాల వద్ద గల అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి విశ్వనాథపురం సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.