ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

మాజీ కేంద్ర మంత్రి పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్ధానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నందు చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అన్నదానం చేశారు.

తొలుత అభిమానులు ఏర్పాటు చేసిన మెగాస్టార్ పుట్టినరోజు కేకును మహిళా అభిమాని ఆదిలక్ష్మి కోసి పంచిపెట్టారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముల్లా సుల్తాన్ మోహిద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ నాయకులు షేక్ రహమతుల్లా, షేక్ జిలానీ, యం బాజీ, జనసేన పార్టీ నాయకులు పేరుస్వాముల శ్రీనివాస్, హల్చల్ జహీర్, నాగార్జున యాదవ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.