మాగుంటను కలిసిన దివ్యాంగులు…..నివేశన స్ధలాలు ఇవ్వాలని వినతి
శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డిని దివ్యాంగులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళితే అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, కార్యదర్శి మురబోయిన బాబూరావు యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలులోని మాగుంట శ్రీనువాసులరెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి గృహాలు మాంజూరైన 39 మంది దివ్యాంగులకు నివేశన స్ధలాలు మాంజురుకు వెంటనే కృషి చేయాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి నివేశన స్ధలాలు మంజూరు చేయిస్తానని అన్నారు.