రైతు సదస్సును జయప్రదం చేయండి : తెదేపా

మార్కాపురం నందు రేపు గురువారం నాడు జరిగే రైతు సదస్సును జయప్రదం చేయాలని సా మీల్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, తెలుగు దేశం వాణిజ్య విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు సమంతపూడి నాగేశ్వరరావు, మండల తెలుగు దేశం పార్టీ నాయకులు సన్నెబోయిన సుబ్బారావు,‌రాము, కాటూరి వెంకటేశ్వర్లు, తెలుగు యువత నాయకులు ముని శ్రీనివాస్ కోరారు.

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 16వ తేదీన మార్కాపురం పట్టణం నందు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు కోసం తెలుగు దేశం పేరుతో ర్యాలీ మరియు ‌ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు