5న జరిగే టిడిపి శంఖారావం బహిరంగ సభ ను జయప్రదం చేయండి -టిడిపి నేత జివి ఆంజనేయులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన కనిగిరి పట్టణంలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంఖారావం బహిరంగ సభ ను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ శంఖారావం బహిరంగ సభ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు జివి ఆంజనేయులు పిలుపునిచ్చారు.

బుధవారం నాడు స్ధానిక విశ్వనాథపురం లోని ఒక ప్రైవేటు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన తెలుగు దేశం అత్యవసర సమావేశంలో తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో 25 బహిరంగ సభలను నిర్వహించాలనే తలంపుతో తొలి బహిరంగ సభ ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి లో ఏర్పాటు చేసేందుకు పార్టీ నిర్ణయం తీసుకుందని కావునా ప్రతి ఒక్క కార్యకర్త శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు


శంఖారావం బహిరంగ సభ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు జివి ఆంజనేయులు, నియోజకవర్గ పరిశీలకులు రాజా నాయుడు లను tnsf రాష్ట్ర కార్యదర్శి వరికూటి అనీల్ ఘనంగా సత్కరించారు

 

ఈ కార్యక్రమంలో పొదిలి కొనకనమిట్ల మండలాల నాయకులు గునుపూడి భాస్కర్, పండు అనీల్, షేక్ మహమ్మద్ రసూల్, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి,మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, మాజీ సర్పంచ్ లు కాటూరి నారాయణ ప్రతాప్, స్వర్ణ గీత, ముల్లా ఖుద్దుస్, మీగడ ఓబుల్ రెడ్డి, మూరబోయిన బాబురావు యాదవ్, చప్పడి రామలింగయ్య, కనకం నరసింహారావు,తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సుకదేవ్, యస్ఎం భాషా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు