పొదిలి టైమ్స్….. లైఫ్ టైమ్ అవార్డు గ్రహీత మాకినేని
లైఫ్ టైమ్ అవార్డు గ్రహీతగా పొదిలిటైమ్స్ యాజమాన్యం మాకినేని వెంకట రమణయ్యను ఎంపిక చేసి అవార్డు ప్రధానం చేశారు. 84 సంవత్సరాల సీనియర్ సిటిజన్ మాకినేని వెంకట రమణయ్య…. పార్వతీదేవి సమేత నిర్మహేశ్వర స్వామి దేవస్థానానికి సుమారు 50 లక్షల స్వంత నిధులను కేటాయించి నిర్మాణం చేయించడమే కాకుండా ఇటీవల శ్రీకాకుళం వరదభాదితులకు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు చెక్కను అందజేసి తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. పలు ప్రజా ఉద్యమాలలో పనిచేసి అలుపెరగని యోధుడిగా కూడా ఆయనను చెప్పుకోవచ్చు. ఈయన దానగుణ మరియు పోరాట ప్రటిమను పరిగణలోకి తీసుకుని పొదిలి టైమ్స్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా తొలి లైఫ్ టైమ్ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, కందుల నారాయణరెడ్డి, పొదిలి టైమ్స్ గ్రూప్ చైర్మన్ మందగిరి వెంకటేష్ యాదవ్, డైరెక్టర్ షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు.