పొదిలి టైమ్స్ లైఫ్ టైమ్ అవార్డు గ్రహిత సీనియర్ సిటిజన్ మాకినేని రమణయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
వివరాల్లోకి వెళితే స్ధానిక కాటూరిపాలెంలోని మాకినేని రమణయ్య నివాసం వద్ద స్థానికులు ఆయన 85వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్ధానికులు మాట్లాడుతూ మాకినేని రమణయ్య తన సొంత నిధులు వెచ్చించి 50లక్షల రూపాయలతో శివాలయం ముఖద్వారాన్ని నిర్మించారని…. అదేవిధంగా మరో 50లక్షల రూపాయలతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారని అలాంటి ఆదర్శమూర్తి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సునీల్ , ఆంజనేయులు ,అశోక్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.