మల్లికార్జున కుటుంబానికి అండగా ఉంటా- నూకసాని బాలాజీ
పొదిలి గృహ నిర్మాణ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తు అందరి మన్ననలు పొంది మరియు పేద కుటుంబాలకు, కాలనీ వాసులు కు ఎంతో సహాయ సహకారాలు అందిచిన మంచి అధికారి కీర్తిశేషులు శ్రీ శివరాత్రి మల్లికార్జునరావు గారి మరణం నన్ను ఎంతగానో కలచివేసింది , మల్లిఖార్జునరావు వ్యక్తిగతంగా నాకు ఎంతో ఆప్తులు, ఈ కరోనా వల్ల ఎంతో మంది ఆత్మీయుల ను కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తూ సంతాపం వ్యక్తం చేస్తు మల్లికార్జునరావు కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటానని తెలుగుదేశం ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
అదే విధంగా స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు పొల్లా నరసింహా యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్, బాలగాని నాగరాజు, పెమ్మని అల్లూరి సీతారామరాజు,చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్, తదితరులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు